![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-134లో.. ధీరజ్, ప్రేమ ఇద్దరు గదిలో బంధీలుగా ఉంటారు. ఇక ఎలాగైనా బయటకు రావడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇక కిటికీ నుండి ఇద్దరు బయటపడతారు. మా అన్నయ్య ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి క్లూ దొరకడం లేదే అని ధీరజ్ అనడంతో.. నా దగ్గర ఓ ఐడియా ఉందని ప్రేమ అంటుంది . ఆ ఐడియా ధీరజ్‌కి చెప్తుంది ప్రేమ. అయితే మీ అత్త భద్రవతికి ఫోన్ చేయి అని ధీరజ్ అంటాడు. ఇక భద్రవతికి ప్రేమ ఫోన్ చేసి నువ్వు ఎదురుచూసే ఆ విషయం గురించి అర్జెంట్‌గా నీతో మాట్లాడాలి.. ఫోన్‌లో కాదు.. డైరెక్ట్‌గా మాట్లాడాలి.. నేను లొకేషన్ షేర్ చేస్తా.. ఒంటరిగా రా అత్తా అని అంటుంది ప్రేమ.
ప్రేమ మాటల్ని నమ్మేసిన భద్రవతి... సరేనని బయల్దేర్తుంది. ప్రేమ ఇంత అర్జెంట్‌గా మాట్లాడాలని అంటుందంటే.. ఆ ఇంటిని వదిలి వస్తేనని చెప్పడానికే అయ్యి ఉంటుందని భద్రవతి అనుకుని ప్రేమ పంపిన లొకేషన్ దగ్గరకు వెళ్తుంది. ధీరజ్ భద్రవతికి కనిపించకుండా దాక్కుని వాళ్లని గమనిస్తుంటాడు. విషయం ఏంటో చెప్పు ప్రేమ.. ఏం మాట్లాడుకుండా దిక్కులు చూస్తున్నావ్ ఏంటి? ఏంటి నీ ప్రాబ్లమ్ అని అడుగుతుంది భద్రవతి. ఇంతలో ధీరజ్ అటు నుండి ప్రేమని చూసి.. ఏయ్ ప్రేమ మీ అత్త ఫోన్ తీసుకోమని సైగ చేస్తాడు. దాంతో భద్రవతి ఫోన్‌ని తీసుకుని ఫ్రెండ్‌తో మాట్లాడి వస్తానని పక్కకి వెళ్తుంది ప్రేమ. వెంటనే భద్రవతి ఫోన్‌ని ఫ్లైట్ మోడ్‌లో పెట్టేస్తుంది ప్రేమ. తరువాత ధీరజ్.. మీ అత్తని కిడ్నాప్ చేశామని విశ్వకి మెసేజ్ పెడతాడు. అది చూసిన విశ్వ.. అత్తని కిడ్నాప్ చేయడం ఏంటని భద్రవతికి విశ్వ ఫోన్ చేస్తాడు. అయితే ఫోన్ పనిచేయకపోవడంతో విశ్వ కంగారుపడతాడు. ఇంతలో భద్రవతి ఇంట్లో కనిపించకపోవడంతో సేనాపతి కంగారుపడుతుంటాడు. విశ్వ ఫోన్ చేసి అత్త ఫోన్ పనిచేయడం లేదు.. అత్త ఎక్కడికి వెళ్లిందని అడుగుతాడు. ఏమో తెలియదురా, అత్త కనిపించడం లేదని సేనాపతి అంటాడు. అంటే నిజంగానే తన అత్తని ధీరజ్ గాడు కిడ్నాప్ చేశాడని విశ్వ నమ్మేస్తాడు.
మరోవైపు ముహూర్తం దాటిపోతుంది తొందరగా పెళ్లి కొడుకుని తీసుకుని రావాలని పంతులతో పాటు పెళ్లికి వచ్చిన వాళ్లు తెగ హడావిడి చేస్తుంటారు. మా మరిది, మా ఆయన పెళ్లి కొడుకుని తీసుకుని రావడానికి వెళ్లారు.. కాస్త ఓపిక పట్టండి అని నర్మద అంటుంది. మరోవైపు పెళ్లి కూతురు శ్రీవల్లి ఏడుస్తూనే ఉంటుంది. ఏవండీ దేవుడంటే సాయం నమ్మకం అంటారంటూ వేదవతి ఎమోషనల్ అవుతుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది బుజ్జమ్మా.. పెద్దోడి పెళ్లి మొదలైనప్పటి నుంచి ఏదొక గండం వెంటాడుతూనే ఉంది. నా పెద్ద కొడుకు గురించి నాకు బాగా తెలుసు.. వాడు అలా చేయడు.. వాడిపై నాకు నమ్మకం ఉంది కానీ.. ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ.. నా ఆశలు ఆవిరైపోతున్నాయి బుజ్జమ్మా అని రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు. పెద్దోడు ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, చిన్నోడు తీసుకొస్తాడండీ.. ఈ పెళ్లిని జరిపిస్తాడని వేదవతి అంటుంది. అన్నట్టుగానే ధీరజ్, ప్రేమ కలిసి పెద్దోడ్ని రక్షించి తీసుకొచ్చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |